
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఈమధ్య జరిగిన జమ్మూకాశ్మీర్లోని ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హై అలర్ట్ నడుస్తోంది. దేశంలోని పలు ముఖ్య దేవాలయాలు అలాగే ముఖ్య నగరాలలో భద్రతను ముమ్మరం చేశారు. హోం మంత్రి అమిత్ షా సూచనలు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తానీ వ్యక్తులను తిరిగి ఆ దేశం పంపించే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్ని పుణ్యక్షేత్రాల్లో భద్రత బలగాలను మోహరించారు. ఈ మేరకు దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిత్యం ఈ దేవాలయానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తుండడంతో ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశాలు ఉంటాయని ఆలోచనతో ముందస్తు చర్యలలో భాగంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ మేరకు తిరుమల లో క్యాబులు నడుపుతున్నటువంటి 400 మంది డ్రైవర్లు అలాగే 50 మంది ఓనర్లతో తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రతల కోసం జల వ్యవహరించాలని దానిపై క్యాబ్ డ్రైవర్లతో భేటీ అయ్యారు. ఈ మేరకు కొండపై వెళ్లే దారిలో ఎవరైనా అనుమానాస్పదకంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. నిషేదితమైన వస్తువులను తిరుమల తిరుపతి కొండపైకి తీసుకు వస్తే కచ్చితంగా వాళ్లకి జైలు శిక్ష విధిస్తామని చెప్పుకొచ్చారు. దొంగలు లేదా ఇతర నేరస్తులు ఎవరి వాహనాలైనా ఎక్కినట్లు అనిపిస్తే ఖచ్చితంగా దగ్గరలోని పోలీసులకు లేదా 112 కు సమాచారం అందించాలని హర్షవర్ధన్ రాజు తెలిపారు. అంతేకాకుండా ప్రతిక్షణం కూడా తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలోని అన్ని రోడ్లు అలాగే ముఖ్య జంక్షన్ల లో బాంబు అలాగే డాగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉన్నాయి. ఆలయాల దగ్గర భద్రతను కూడా భారీగా పెంచారు. తిరుమలలోని చాలా చోట్ల సీసీ కెమెరాల పని తీరుపై అధికారులు నిగా ఉంచారు. సీసీ కెమెరాలు ద్వారా ప్రతి ఒక్కరి కదలిక పై నిగా ఉంచాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు.