
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- వైసీపీ మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉత్కంఠత నెలకొంది. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చిన కూడా గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. అయితే తాజాగా పోలీసులు గోవర్ధన్ రెడ్డికి లుకవుట్ నోటీసులు జారీ చేశారు. గోవర్ధన్ రెడ్డి దేశం విడిచి వెళ్లిపోకుండా అన్ని ఎయిర్పోర్టులు అలాగే సి పోర్టులోని అధికారులను అలెర్ట్ చేశారు. కొద్దిరోజులు ముందు గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోరగా… న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో వైసీపీ మాజీమంత్రి గోవర్ధన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్టు అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠత నెలకొంది. రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసిపి నాయకులు చాలామంది అరెస్టు అవుతున్న ఘటనలు రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా వైసిపి మాజీమంత్రి గోవర్ధన్ రెడ్డి కూడా త్వరలోనే అరెస్టు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బీజేపీతో కలిసి రేవంత్‌రెడ్డి భారీ స్కామ్ – త్వరలో పేలనున్న పొలిటికల్ బాంబ్ ఇదేనా..!