తెలంగాణ

గొల్లపల్లిలో ఉద్రిక్తత బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి

జగిత్యాల జిల్లా బ్యూరో (క్రైమ్ మిర్రర్):- గొల్లపల్లి మండల బిజెపి నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దాడులు చేయడం కలక లం సృష్టించిం ది. ఇది మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రం లోని రామాలయం గుట్టపై కాంగ్రెస్ నాయకు లు కట్టుకున్న ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీనికి బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేశ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంగెం కల్యాణ్ కారణమని పేర్కొంటూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, నేరెళ్ల మహేశ్, ఓర్సు విజయ్, నల్ల విక్రంరెడ్డి, దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చినా వారి ఎదుటనే మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంఘెం కల్యాణ్ వీపులో గాయాలయ్యాయి. ఇంటి అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యుల పైనా దాడికి పాల్పడి కట్ట మహేశ్, సంగెం కల్యాణ్ ని చంపుతామని బెదిరించారు. తనను కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించారని కల్యాణ్ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, నేరెల్ల మహేశ్, ఓర్సు విజయ్, నల్ల విక్రం రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నట్లు ఎస్ ఐ సతీశ్ తెలిపారు.

మర్రిగూడ మండలంలోని తమ్మడ్‌పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

జగన్‌కు సొంత పార్టీ నుంచే వెన్నుపోట్లు – టీడీపీతో కలిసి వైసీపీ ఓటమికి ప్లాన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button