శబరిమలలో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులకు సరైన సదుపాయాలు ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలుగు స్వాములపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కేరళ పోలీసులు.తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులపై పోలీసులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని స్వాములు ఆరోపిస్తున్నారు.
దేశం నలుమూలల నుండ మాల ధరించిన అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున శబరిమలకు స్వామివారి దర్శనానికై వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా స్వామివారి నెయ్యాభిషేకానికై స్వాములు వేలా సంఖ్యల్లో తరలి వస్తున్నారు. పంబ గణపతి నుండి శబరిమల దేవస్థానం వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు,వృద్ధులకు చిన్నారులకు వికలాంగులకు ఎలాంటి సపరేటు క్యూలైన్లు ఏర్పాటు చేయలేదు. అందరిని ఒకే క్యూలో పంపించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. నీళ్ల సదుపాయాలు మరుగుదొడ్లు సదుపాయాలు లేకపోవడంతో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మల్కాజిగిరి నుండి ఇరుముడి కట్టుకొని పెద్ద ఎత్తున శబరిమలకు బయలుదేరిన స్వాములు రవికుమార్ గురుస్వామి మాట్లాడుతూ శరణ్ గుత్తి దగ్గర తొక్కిసలట కావడంతో కొంతమంది భక్తులకు గాయాలయ్యాయి,కేరళ ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం పోలీసు వారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు. సరైన సదుపాయాలు ఏర్పాట్లు చేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని భక్తులు అంటున్నారు.భక్తుల నుండి కేరళ ప్రభుత్వంపై పెద్ద ఎత్తు విమర్శలు వెల్లువెత్తతున్నాయి.