
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- కొందుర్గు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధి లోని టేకుల పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, మాజి సర్పంచ్ వెలివర్తి పవిత్ర మోహన్ రెడ్డి ల దంపతుల చిన్న కూతురు ప్రగతి రెడ్డి (35), కుమారుడు అర్విన్ (6), అత్త సునీత (56) అమెరికాలోని ఫ్లోిరిడా లో 16/3/25 తెల్లవారు జామున 3 గంటలకు (భారత కాల మానం ప్రకారం) అమెరికా కాల మాన ప్రకారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదoలో ముగ్గురు మృతి చెందడం జరిగింది.
ప్రగతి రెడ్డి వాళ్ళ అత్తగారి గ్రామం సిద్దిపేట దగ్గర బక్రీ చప్రియాల్ గ్రామము.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు చనిపోవడం. టేకులపల్లి లోని బి ఆర్ఎస్ పార్టీ నాయకు డి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల బంధుమిత్రులు గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు టేకులపల్లి గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. మృతి చెందిన వారి దహన సంస్కారాలు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయని తీవ్ర మనోవేదన తో మృతిరాలి తండ్రి మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
మూడు రోజుల్లోనే 24 కోట్లు సంపాదించిన “కోర్ట్ “