
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ “దిష్టి తగిలింది” అన్న కామెంట్లపై తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకంటే… పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోనసీమకు దిష్టి తగిలింది అని… మన రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనము ఒక కారణమై ఉంటుంది అని డిప్యూటీ సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే నరుడు దిష్టికి నల్ల రాయి అయినా బద్దలై పోతుంది కదా అని అన్నారు. అలానే కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి మరియు వాకిటి శ్రీహరి తీవ్రంగ ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని కోమటిరెడ్డి మండి పడగా.. మరోవైపు రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు మంచిది కాదు అని మంత్రి శ్రీహరి అన్నారు. తక్షణమే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని లేదంటే ఒక సినిమా కూడా ఆడదు అని ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నాను అని సవాల్ విసిరారు. సారీ చెబితే నైనా ఒకటి లేదా రెండు సినిమాలు ఆడుతాయి లేదంటే అవి కూడా ఆడవు అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
Read also : Wedding drama: మలుపు తిరిగిన వివాహ కధ.. పెళ్లి మండపం నుంచి ప్రియుడితో పారిపోయిన వధువు
Read also : Gold prices: తగ్గిన బంగారం ధరలు





