
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్లు విరుచుకుపడ్డారు. రెండవ వన్డే మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్నిత 50 ఓవర్లకు 358 పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు జైస్వాల్ ఇద్దరూ కూడా నిరాశపరచగా ఆ తరువాత వచ్చినటువంటి ఋతురాజు గైక్వాడ్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. రోహిత్ శర్మ 14, జైష్వాల్ 22, విరాట్ కోహ్లీ 102, గైక్వాడ్ 105, కేఎల్ రాహుల్ 66 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. మొత్తంగా 50 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా బౌలర్లు భారత బ్యాట్స్మెన్ లకు బౌలింగ్ వేయడంలో తేలిపోయారు. జాన్సన్ 2, బర్గర్ మరియు ఎంగిడి తలో వికెట్ తీశారు. ఇక సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో గెలవాలి అంటే 359 పరుగులు చేయాలి. లేదంటే భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.
Read also : A Huge Encounter: ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి
Read also : Casting Couch: మాయ మాటలతో మైనర్ బాలికపై అత్యాచారం.. చివరికి





