
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణి చోరీ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు పై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీపై వైసీపీ చీఫ్ జగన్ స్పందిస్తూ ఇది చిన్న చోరియే.. పోయింది కేవలం 72000 రూపాయలు మాత్రమే అని దీనిపై తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత సీరియస్ గా ఉందన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడగా.. టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా జగన్ పై మండిపడుతున్నారు. 72 వేల రూపాయలు చోరీ చేసిన వ్యక్తి తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి 14 కోట్లు ఎలా కట్టగలిగాడు అని తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జగన్ ను ప్రశ్నించారు. దొంగలించిన దానికి అదనంగా డబ్బులు ఇస్తే ఆ కేసు మాఫీ అవుతుందా?.. అని నిలదీశారు. మరి CBI కి 70000 కోట్లు ఇస్తే మీ కేసులు అన్నీ కూడా మాఫీ చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి.. అని పళ్ళ శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ చోరీపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందిస్తూ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి డబ్బులు చోరీ చేసిన వ్యక్తికి జగన్ సపోర్టుగా నిలబడడం పట్ల మండిపడిన విషయం తెలిసిందే.
Read also : ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యనే.. 50 లక్షలు ఇవ్వాల్సిందే : హరీష్ రావు
Read also : మండల ఎన్నికల అధికారి నిర్లక్ష్యంతో నర్సంపల్లి పంచాయతీ ఎన్నిక వాయిదా





