
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తాజాగా కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ నాయకులు చేసేటువంటి ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ మొన్న ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన సభలో ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అసలు వైసీపీ గెలవాలి కదా… అయినా మేము ఉండగా ఎలా గెలుస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రానివ్వమని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై తాజాగా పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ కి తన కార్యకర్తలని పట్టించుకునే టైమే లేదు అని… తన శాఖలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదని పవన్ కళ్యాణ్ ను నాని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా వైసీపీ పార్టీని గెలుస్తుందని… పవన్ కళ్యాణ్ ఇది గుర్తుపెట్టుకోవాలని పేర్ని నాని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలను పీడిస్తున్నారని పేర్ని నాని అన్నారు. టిడిపి సైకో బ్యాచ్ రెచ్చిపోతుందని… రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లాలోని మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పై పట్టపగలు నడిరోడ్డుపై టిడిపి గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రమంతా కూడా ఉలిక్కిపడిన సందర్భం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుందని అన్నారు. టిడిపి రాష్ట్రంలో రక్తపాతం సృష్టిస్తుంటే దాన్ని కూటమినేతలందరూ కూడా ప్రోత్సహిస్తుండడం మరో ఎత్తు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కూటమినేతల రౌడీయిజం.. గుండా గిరి తో అరాచక పాలన కనిపిస్తుంది అని అన్నారు.