
-
తెలంగాణలో ఏసీబీ దూకుడు
-
ఏసీబీ వలలో చిక్కుతున్న అవినీతి అధికారులు
-
వరుస సంఘటనలతోనూ బెదరని లంచగొండులు
-
ఇవాళ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ట్యాక్స్ ఆఫీసర్
-
జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.8వేలు డిమాండ్
-
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. రోజుకో దగ్గర లంచగొండులు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. అయినా కానీ అవినీతిపరులకు ఏమాత్రం భయం లేకుండా పోతోంది. తాజాగా మాదాపూర్ సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధ ఏసీబీకి పట్టుబడింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.8వేలు డిమాండ్ చేసింది సుధ. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం గగన్ విహార్‌లోని ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. నిందితురాలి అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.