
క్రైమ్ మిర్రర్, తమిళనాడు న్యూస్:- తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే.. చెన్నైలోని ప్రముఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. హాస్పటల్ వైద్య బృందం ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ… అన్ని చెకప్ లు కూడా చేశారు. అయితే తాజాగా సీఎం స్టాలిన్ హెల్త్ బులిటెన్ అపోలో ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేశారు.
రెండు పూటలా కుక్కలను వాకింగ్ కు తీసుకెళ్తే నెలకు 4 లక్షల జీతం!
అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ అనిల్ బీజీ సీఎం స్టాలిన్ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ… ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో సీఎం స్టాలిన్ కు తీవ్ర అస్వస్థతకు గురై కళ్ళు తిరుగుతుండగా వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన మా వైద్య బృందం ముఖ్యమంత్రి స్టాలిన్ కు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు కూడా చేశాము అని తెలిపారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని… ఎవరు కూడా భయపడాల్సిన పనిలేదని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉన్న కారణంగా అపోలో ఆసుపత్రి చుట్టూ కూడా కట్టుదిట్టమైన భద్రతను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు.