జాతీయంలైఫ్ స్టైల్

Talking Nonsense: మీకు తెలుసా? బూతులు మాట్లాడటం కూడా ఆరోగ్యకరమేనని!

Talking Nonsense: మనిషి భావోద్వేగాలు ఎప్పుడు ఎలా బయటపడతాయో ముందుగానే చెప్పడం కష్టం. ప్రత్యేకంగా బూతులు మాట్లాడేవారిని సమాజం తరచూ నెగెటివ్‌గా చూసినా, ఇటీవల వచ్చిన కొన్ని అధ్యయనాలు మాత్రం విభిన్నమైన నిజాన్ని వెల్లడించాయి.

Talking Nonsense: మనిషి భావోద్వేగాలు ఎప్పుడు ఎలా బయటపడతాయో ముందుగానే చెప్పడం కష్టం. ప్రత్యేకంగా బూతులు మాట్లాడేవారిని సమాజం తరచూ నెగెటివ్‌గా చూసినా, ఇటీవల వచ్చిన కొన్ని అధ్యయనాలు మాత్రం విభిన్నమైన నిజాన్ని వెల్లడించాయి. బూతులు మాట్లాడే వ్యక్తులలో నిజానికి మంచి మనసు, నిజాయితీ, స్పష్టత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మనసులో పేరుకుపోయిన ఒత్తిడి లేదా భావోద్వేగ భారం ఒక్కసారిగా తగ్గేందుకు, అలాంటి పదాలు ఒక మార్గంలా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంటే ప్రతి సందర్భంలో బూతులు మాట్లాడటం కాదుగానీ, ఎప్పుడు తీవ్రమైన ఎమోషన్‌ను వ్యక్తపరచాల్సి వస్తుందో అప్పుడు అవి ఒక విధమైన రిలీఫ్‌గా మారతాయి.

సోషల్ మీడియాలో ఒక డాక్టర్ చెప్పిన వివరణ దీనికి మరింత స్పష్టతనిస్తుంది. బూతులు మాట్లాడటాన్ని వైద్య శాస్త్రంలో కోప్రోలెలియా లేదా లోగోషీజియా అంటారు. ఇవి తరచుగా బూతులు వాడే వ్యక్తులకు ఉపయోగించే వైద్య పదాలు. సాధారణంగా మనం స్నేహితులతో సరదాగా మాట్లాడేటప్పుడు, లేక ఒత్తిడిలో మనలో మనమే అనుకునేటప్పుడు ఈ పదాలు సహజంగానే బయటపడుతుంటాయి. దీని వెనుక ఉన్న అసలు భావం ఏమిటంటే.. మనం మనలో దాచుకున్న కోపం, నిరాశ, బాధ లేదా నొప్పిని ఒక్కసారిగా విడుదల చేసే ప్రయత్నం. దీన్నే ఎమోషనల్ డిశ్చార్జ్ అంటారు. ఇది మానసికంగా మనకు ఉపశమనం ఇస్తుంది.

ఉదాహరణకు పనిలో తప్పు జరిగితే లేదా మరెవరైనా మనను బాధపెట్టినప్పుడు, స్నేహితుడితో మాట్లాడేటప్పుడు బూతు పదం ఆ భావోద్వేగాన్ని పూర్తిగా విడుదల చేస్తుంది. ఇదంతా మెదడులో ఒత్తిడిని తగ్గించే ప్రక్రియ. అంతేకాదు కొన్ని సందర్భాల్లో బూతులు శారీరక పనితీరును కూడా మెరుగుపరుస్తాయని పరిశోధనలలో తేలింది. ఉదాహరణకు కఠినమైన పని చేస్తున్నప్పుడు ఒక్కసారిగా బలంగా బూతు పలకడం ద్వారా శరీరంలో ఎనర్జీ పెరిగి పని సులభంగా చేయగలుగుతాం. ఇదే కారణంగా తీవ్రమైన శారీరక శ్రమల సమయంలో లేదా వ్యాయామంలో కూడా కొందరు సహజంగానే బూతులు మాట్లాడుతారు.

ఇక ఒంటరిగా మాట్లాడుకునేటప్పుడు, స్నేహితులతో సంభాషణల్లో లేదా భాగస్వామితో సన్నిహిత పరిస్థితుల్లో కూడా బూతులు వాడడంలో ఎలాంటి తప్పు లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది భావప్రకటనను మెరుగుపరచడమే కాకుండా, anxiety, stress లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఆత్మీయతను పెంచడంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా సంభాషణలోని నిజాయితీ, పారదర్శకత పెరుగుతుంది.

కానీ సమస్య ఎప్పుడు వస్తుంది అంటే.. బూతులు ఉపయోగించి ఎదుటి వ్యక్తిని కించపరిచినప్పుడు. వారి వ్యక్తిత్వాన్ని అవమానించేలా బూతులు మాట్లాడటం, కుటుంబసభ్యులను దూషణలో చేర్చడం, లేదా కోపంతో వ్యక్తిని అవమానించే విధంగా బూతులు ప్రయోగించడం మాత్రం సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీయగలదు. అంటే బూతులు ఆరోగ్యపరంగా ఉపయోగపడే సందర్భాలు ఉన్నప్పటికీ, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ALSO READ: Shocking facts: పెళ్లి చేసుకోకపోతే ముందస్తు మరణాలు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button