తెలంగాణ

పర్మిషన్ లేకుండా అక్రమంగా నడుస్తున్న కంపెనీ పై చర్యలు తీసుకోండి :పంది పెంటయ్య

క్రైమ్ మిర్రర్ రంగారెడ్డి :- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కుంట్లూరు రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 232,233,234,235 లో సుమారు 10 ఎకరాలల్లో ఓ మార్వాడి వ్యాపారి స్థానికంగా వున్నా భూమి పట్టాదారితో ఒప్పందం కుదిరించుకొని అగ్రిమెంట్ చేసుకున్నాడు.అనంతరం మార్వాడి వ్యాపారి భారీ ఎత్తున కోట్ల రూపాయల తో 10 షెడ్డులని నిర్మించాడు. మున్సిపల్, తహసీల్దార్ ఇండస్ట్రియల్ అధికారులను ఎవరిని సంప్రదించకుండా తనకున్న పలుకుబడితో గత ఐదు సంవత్సరాలనుండి మార్బుల్స్ ని పక్క రాష్ట్ర ల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి తీసుకోచ్చి షెడ్డు లలో స్టోరేజ్ చేసుకొని అక్కడనుండి హైదరాబాద్ చుట్టూ పక్కల షాప్ లకు అధికధరలతో మార్వాడి వ్యాపారి సరఫరా చేస్తున్నాడు. చుట్టూ పక్కల ఇండ్ల స్థలాల మధ్య కంపెనీ నిర్మాణం చేయొద్దని స్థానికులు అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. దుమ్ము దులితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేసి కంపెనీ కి పర్మిషన్ నాలా ఎటువంటి వీ లేకుండా నడిపిస్తున్నాడని పలు మార్లు అధికారుల దుష్టికి తీసుక పోయిన పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు పంది పెంటయ్య అన్నారు. హైదరాబాద్ ఒడ్డున పర్మిషన్ లేకుండా గత ప్రభుత్వ హయాంలో భారీ మార్బుల్స్ కంపెనీ ఏర్పాటు చేయడమే కాకుండా పర్మిషన్ లేనప్పటికి మున్సిపల్ అధికారులు కంపెనీ పై చర్యలు తీసుకోక పోవడం వెనుక ఆంతర్యం ఏంటని అయన అన్నారు.కంపెనీ పై కోర్ట్, పలు కేసులు వున్నప్పటికి యాద్దెచ్చగా మార్వాడి వ్యాపారి వ్యాపారం కొనసగించడం పై పలు అనుమానాలు వ్యక్తం అయితున్నవని పెంటయ్య పేర్కొన్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు పర్మిషన్ లు లేకుండ చలామణి అయితున్న మార్బుల్స్ కంపెనీ పై చర్యలు తీసుకొని కంపెనీ ని సిజ్ చేయాలనీ అయన డిమాండ్ చేశాడు. చేయని యెడల కంపెనీ ముందు స్థానిక ప్రజలతో ధర్నా చేపడుతాం అని హేచ్చరించాడు.

ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీల పెద్దల పాగా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button