తెలంగాణ

జగన్‌లాంటి నేతలు మనకు అవసరమా?

  • మహిళా ఎమ్మెల్యేను దూషించినవారికి పరామర్శలా?

  • ఎవరైనా ఎక్కువ చేస్తే తోకలు కత్తిరిస్తా: చంద్రబాబు

  • జమ్మలమడుగులో పెన్షన్‌ దారులతో బాబు ముఖాముఖి

  • వితండవాదం చేయడంలో వైసీపీ ఫస్ట్‌: చంద్రబాబు

  • త్వరలోనే కడప స్టీల్‌ ప్లాంట్‌ ప్రారంభిస్తాం

  • కడపలో ఈసారి 10కి పది గెలుస్తాం: చంద్రబాబు

క్రైమ్‌మిర్రర్‌, నిఘా: కడప జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్షన్‌ లబ్దిదారులతో చంద్రబాబు ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వితండవాదం చేయడంలో వైసీపీ ముందుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఓ మహిళా ఎమ్మెల్యేను దూషించిన నాయకుడిని జగన్‌ పరామర్శించారు. జగన్‌ లాంటి నేతలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఎవరైనా తోకజాడిస్తే వారి తోకలు కత్తిరించడానికి వెనుకాడనని చంద్రబాబు హెచ్చరించారు.

పేదలకు ఏడాదికి రూ.32,146కోట్ల పెన్షన్లు ఇస్తున్నామని, ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏమైనా ఉంటుందా అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో టీడీపీ ఏడు స్థానాల్లో గెలిచిందని, ఈసారి పదికి పది సీట్లు గెలిపిస్తారని అనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.

ఎన్టీఆర్ ఆలోచనతోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులుచేపట్టామన్నారు చంద్రబాబు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరువు ఉండదని, రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

Read Also: 

  1. సీఎం రేవంత్‌రెడ్డికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక అందజేత
  2. అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ దోషే
Back to top button