
మంచిర్యాల,(క్రైమ్ మిర్రర్):-మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులు, విభాగాలను పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవలపై నేరుగా ఆరా తీశారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య అధికారులు, సిబ్బందికి ఎంపీ సూచించారు. ఆసుపత్రిలో మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి రావడంతో, ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో తనకు పరిచయమైన డ్రైవర్ శంకర్ తల్లి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ, ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read also : చైనీస్ మాంజా ప్రజల ప్రాణాలకే కాదు పర్యావరణానికి కూడా ముప్పే : సజ్జనార్
Read also : తండ్రైన తెలుగు స్టార్ క్రికెటర్..?





