జాతీయం

కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్‌ నాయకుడు అచ్యుతానందన్‌ కన్నుమూత

  • అచ్యుతానందన్‌ వయసు 101 సంవత్సరాలు

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అచ్యుతానందన్‌

  • ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

  • 2006-2011 మధ్యలో కేరళ సీఎంగా పనిచేసిన అచ్యుతానందన్‌

  • సీపీఎం వ్యవస్థాపకుల్లో అచ్యుతానందన్‌ ఒకరు

  • కేరళలో సీపీఎంను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన నేత

క్రైమ్‌మిర్రర్‌, న్యూఢిల్లీ: కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్‌ నాయకుడు కేఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూశారు. అచ్యుతానందన్‌ వయసు ఇప్పుడు 101 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్యం, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం అచ్యుతానందన్‌ తుదిశ్వాస విడిచారు.

కేరళ రాష్ట్రంలోని అలప్పుజలో 1923 అక్టోబర్‌ 20న ఓ నిరుపేద కుటుంబంలో అచ్యుతానందన్‌ జన్మించారు. బాల్యం నుంచి వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేశారు. కార్మిక నాయకుడిగా ఆయన వామపక్ష ఉద్యమంలోకి అడుగుపెట్టారు. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్‌ కోర్‌ రాష్ట్రంలో భూస్వాములపై పోరాడి జైలుకెళ్లిన చరిత్ర అచ్యుతానందన్‌కు ఉంది.

వామపక్ష పార్టీలో చీలిక అనంతరం అచ్యుతానందన్‌ సీపీఎంలో ఉన్నారు. సీపీఎం వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 1967 నుంచి 2016 వరకు ఆయన వరుసగా కేరళ అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళ సీఎంగా పనిచేశారు. మూడుసార్లు విపక్ష నేతగా కొనసాగారు. కేరళ సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశంలోనూ సీపీఎం బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఆయన తిరుగులేని ముద్ర వేశారు.

Read Also: 

  1. హైదరాబాద్‌లో 30 చెరువులకు పునర్జన్మ… హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ
  2. ఒడిశాలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడి ఘాతుకం… ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం
  3. స్కూల్‌ బిల్డింగ్‌పై కూలిన ఎఫ్‌-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్‌, 19మంది మృతి
Back to top button