అంతర్జాతీయం

రష్యాలో కుప్పకూలిన విమానం, 50మంది దుర్మరణం!

  • చైనా సరిహద్దు, రష్యా తూర్పు దిక్కున విమానం గల్లంతు

  • అంగారా విమానయాన సంస్థకు చెందిన విమానం

  • అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం

క్రైమ్‌మిర్రర్‌, నిఘా: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళ్తున్న అంగారా విమానం కుప్పకూలింది. విమానంలో 50మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చనిపోయినట్లుగా భావిస్తున్నారు.

అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టిండాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాసేపట్లో విమానం ల్యాండవుతుందనగా… ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను అలర్ట్‌ చేశారు. గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు నిర్థారించారు.

విమానం కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెస్య్కూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. విమానం తొలిసారి ల్యాండయ్యేందుకు ప్రయత్నించింది… అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. రెండోసారి ల్యాండింగ్‌కు యత్నించిన సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయి, ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది చనిపోయినట్లుగా భావిస్తున్నారు.

Read Also: 

  1. రాహుల్‌, ఖర్గేతో సీఎం రేవంత్‌, భట్టి భేటీ… 2గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం

  2. ప్రముఖ యాంకర్‌ సుమ భర్తకు షాక్… నటుడు రాజీవ్‌ కనకాలకు రాచకొండ పోలీసుల నోటీసులు

Back to top button