
మిర్యాలగూడ,(క్రైమ్ మిర్రర్):-
దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటిపిఎస్) లో శంకుస్థాపన, యూనిట్ ప్రారంభ కార్యక్రమాలకు ఆగస్టు 1న రాష్ట్ర స్థాయి మంత్రులు పర్యటించనున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు-భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరవుతారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
Read also : ఆర్టీసీ బస్సు దగ్దం కేసులో ఇద్దరు అరెస్ట్.. నిందితులిద్దరూ పాత నేరచరిత్ర ఉన్నవాళ్లే!
బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 9:00 గంటలకు బయలుదేరి, ఉదయం 10:00 గంటలకు వైటిపిఎస్ చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10:15 నుంచి 11:00 గంటల వరకు సమీకృత టౌన్‌షిప్ శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది.11:05 నుంచి 11:45 గంటల వరకు వైటిపిఎస్ స్టేజ్-2లో 800 మెగావాట్ల యూనిట్-1 ను జాతికి అంకితం చేయనున్నారు.అలాగే మధ్యాహ్నం 12:10 నుంచి 1:00 గంటల వరకు జెన్కో, బిహెచ్ఇఎల్ అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, చర్చా గోష్టి నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 1:45కు దామరచర్ల నుంచి తిరిగి బేగంపేట వెళ్తారని వెల్లడించారు.
Read also : రైతులకు తీపికబురు, రేపే రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు!