తెలంగాణ

బావ బామ్మర్దుల ప్రాణం తీసిన పుణ్యస్నానం..!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్నాన ఘట్టం వద్ద నదిలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ఈ ఘటన శుక్రవారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు మృతుడి అన్న ప్రసాద్ తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం హరిదాస్ పల్లి గ్రామానికి చెందిన పత్తి హరి ప్రసాద్ (17) తో పాటు హరి ప్రసాద్ మేనత్త కుమారుడు ఖమ్మం వాసి పవన్(19) స్నాన ఘట్టం దగ్గర గోదావరి నదిలోఈతకు వెళ్లి మృతి చెందారు.

సంఘటన స్థలంలో ఉన్న భక్తులు, కుటుంబ ద్వారా స్థానిక భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

  1. రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ – 15శాతం వృద్ధే లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు

  2. చౌటుప్పల్ లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన… ఇంటింటికి తిరిగి సమస్యలపై ఆరా

  3. ఏపీ బడ్జెట్ పూర్తి వివరాలు!… మీ క్రైమ్ మిర్రర్ వెబ్సైట్ లో..

Back to top button