
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-విద్యార్ధులు, యువత చెడు అలవాట్ల కు దూరం గా ఉంటే ఆలోచన లో పరిణతి, జీవితం లో ఉన్నతి తధ్యం అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. తుర్క యాంజాల్ కు చెందిన కొందరు యువకులు రఘునందన్ కు ఆత్మీయ సత్కారం చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..యువత స్నేహితులు ప్రభావం వల్ల చెడు అలవాట్ల కు గురయ్యే అవకాశం లేకపోలేదని, యుక్త వయస్సు లో..యుక్తి తో ఆలోచించి చెడు స్నేహానికి దూరం గా ఉంటే పొగాకు, ధూమపానం వంటి దురలవాట్ల కు “గురి”కారని రఘునందన్ సూచించారు. ఇంటర్,డిగ్రీ చేస్తున్నపుడే ఉత్తమ స్నేహితుల తో చేసే చెలిమి వల్ల బహుత్తమ నడత తో కూడిన భవిత యువత సొంతం అవుతుందని దిశా నిర్దేశం చేశారు. దారెడ్డి అభినవ్ రెడ్డి తదితరులు , పొగాకు నియంత్రణ కు రఘునందన్ చేస్తున్న విశేష కృషిని శ్లాఘించారు.
తక్షణమే HCU విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి : బట్టి విక్రమార్క