
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అన్నీ కూడా అప్రమత్తం అయ్యాయి. ఈ భారీ పేలుడు ఘటనలో దాదాపు 13 మందికి పైగా మరణించారు. మరోవైపు 20 మందికి పైగా ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ బాంబు పేలుడు ఘటనలో ఎన్నో విషయాలు మెల్లిగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. తాజాగా ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులకు విస్తు పోయే విషయాలు తెలిసాయి. దాదాపు నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి బాంబు పేలుళ్లకు స్కెచ్ వేసుకొని కూర్చున్నారు అని సమాచారాన్ని కనిపెట్టారు. ప్రతి గ్రూపులోని ఇద్దరూ భారీగా IED తీసుకువెళ్లాలని నిర్ణయించారని.. తెలుసుకున్నారు. భారీ పేలుళ్ల కోసం ఏకంగా 20 క్వింటాలకు పైగా ఎరువులు కూడా సేకరించినట్లుగా దర్యాప్తుల్లో తేలింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్ లో ఆత్మహుతి దాడికి పాల్పడిన ఉమర్ కు 20 లక్షల రూపాయలకు పైగా డబ్బు అందిందని నిఘవర్గాలు స్పష్టం చేసేయి. ఢిల్లీలో బాంబు దాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క అధికారి కూడా ఆప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేది లేదు అని హోం మంత్రి అమిత్ షా తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్రంగా హెచ్చరించారు. కాగా ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రధాన నగరాల ప్రజలందరూ కూడా భయంతో వణికి పోతున్నారు.
Read also : చంద్రబాబు గారు మీ వల్లేనయ్యా ఇది సాధ్యం : సీఎం జగన్
Read also: Adah Sharma: రిస్క్ ఉన్న పాత్రలే నా జీవితంలో మార్పు





