ఆంధ్ర ప్రదేశ్సినిమా

కమెడియన్ ధనరాజ్ విడాకుల గోల…. క్లారిటీ ఇచ్చిన భార్య!.

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మన టాలీవుడ్ హాస్యనటుడు ధనరాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. తనదైన కామెడీతో వెండితెరపై ఎన్నో సినిమాలు నటించి మెప్పించాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ధనరాజ్ భార్య శిరీష మొదటిసారి ఇంటర్వ్యూకు హాజరై ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా ధనరాజ్ భార్య శిరీష మాట్లాడుతూ… ధనరాజ్, తనది ప్రేమ వివాహమని.. ధనరాజ్ ఏమో విజయవాడ, నేనేమో ఖమ్మం అంటూ వివరించి చెప్పింది. మొట్టమొదటిసారిగా ధనరాజ్ ఫిలింనగర్ లో డాన్స్ స్టూడియో పెట్టినప్పుడు టీచర్ కోసం వెతుకుతుండగా… నేను క్లాసికల్ డాన్సర్ని కాబట్టి అలా ఇద్దరం మొదటిసారి కలిసామని చెప్పారు.

జీవితంలో బాగా సెటిల్ అవుతున్నామన్న సమయంలో ‘ధనలక్ష్మి తలుపు తడితే’ అనే సినిమా తీశారు. కానీ ఆ సినిమా నాకు అసలు నచ్చలేదు… ఒకవేళ ఆ సినిమా పోతే మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే అని అనుకున్నాను అని చెప్పింది. చివరికి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మేము రోడ్డు మీద పడ్డామని… విడాకులు కూడా తీసుకుంటున్నామని చాలా వార్తలు వచ్చాయి. మా మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం సహజమే కానీ అప్పుడు వారం లేదా పది రోజులు పాటు మాట్లాడుకోలేదు అంతేకానీ విడాకులు తీసుకునే అంత సీను అయితే రాలేదు అని చెప్పుకొచ్చారు. అలాగే ధనరాజ్ ఫ్రెండ్స్ సుడిగాలి సుదీర్ అలాగా చాలామంది అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారని వివరించింది.

ఇవి కూడా చదవండి .. 

  1. టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న దూరం..!

  2. వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!

  3. ఆ మంత్రి పదవి కోసం నలుగురు పోటీ – రాజగోపాల్‌రెడ్డి ఆశ నెరవేరానా?

  4. సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం

Back to top button