
క్రైమ్ మిర్రర్ , సినిమా న్యూస్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్లిన తర్వాత రిలీజ్ అయిన రెండవ సినిమా ‘OG’. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదలయ్యి ఇప్పటికే మూడు రోజులు కావస్తుంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రికార్డ్స్ కొల్లగొట్టింది ఈ సినిమా. తొలి మూడు రోజులు కలిపి 200 కోట్ల గ్రాస్ వసూలు రాబడినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 154 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మొత్తంగా కలుపుకొని నేటికీ 210 కోట్ల కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లోనే తొలి మూడు రోజుల్లో ఇన్ని కలెక్షన్లు రావడం ఇదే మొదటిసారి.
Read also : ఆదాయం ఎక్కువే..అవస్థలు అంతకుమించినవే..!?
ఇక రాబోయే వారం పండుగ సందర్భం కాబట్టి సెలవుల కారణంగా చాలామంది ఈ సినిమాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకి పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడంతో కలెక్షన్లు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా విడుదలైన రోజు జనసేన నాయకులతోపాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున థియేటర్లకు క్యూ కట్టారు. అంతటితో ఆగకుండా ఫ్రీ బుకింగ్ షో టికెట్స్ లక్షల్లో, వేలల్లో వేలం పాటలలో కొనుగోలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా ద్వారా మరోచరిత్ర సృష్టించారు. పూర్తిగా రాజకీయాల్లో మెలుకువలు నేర్చుకుంటున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒకటి పెండింగ్లో ఉంచారు. ఈ సినిమా కూడా మరి కొద్ది రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాను అని ఎన్నో సందర్భాల్లో అన్నారు.
Read also : ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు