
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన భారతదేశంలో ప్రతి సంవత్సరం నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోతున్నారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు బీటెక్ లేదా డిగ్రీలు పూర్తి చేసి బయటకు వచ్చి ఖాళీగా ఉండిపోవాల్సి వస్తుంది. మన భారతదేశంలో ఎంతోమంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కానీ తాజా గణాంకాలు ప్రకారం గత నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిపోయినట్లుగా పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కీలక నివేదిక వెల్లడించింది. గత అక్టోబర్ నెల వరకు 5.2 శాతం గా ఉన్న ఈ నిరుద్యోగ రేటు నవంబర్ నెల కు 4.7% కి చేరింది.
Read also : Dense Fog: ఒకేసారి 20 వాహనాలు ఢీ.. నలుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు!
ఇక తాజా గణాంకాల 8 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గ్రామాలు మరియు పట్టణాలలో సర్వే చేయగా కీలక సమాచారం అందింది. ఈ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి అలాగే పట్టణాలలో 6.5% శాతానికి తగ్గింది. పట్టణాలలో అయితే భారీగా పెట్టుబడులు రావడం అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా దొరకడంతో నిరుద్యోగశాతం ఎక్కువగా తగ్గింది. ఇక గ్రామాలలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరడం, మహిళలు భాగస్వామ్యం పెరగడంతో ఈ తగ్గుతలకు ప్రధాన కారణాలు అని ఈ సర్వే అధికారులు తేల్చి చెప్పారు.
Read also : Omar Abdullah: రాహుల్ కు ఒమర్ అబ్దుల్లా షాక్.. ఆ ప్రచారంతో తమకు సంబంధం లేదని వ్యాఖ్య!





