ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి చంద్రబాబు, పవన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ – ఇక దబిడి దిబిడే..!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- గడిచిన ఏడాది ఓ లెక్క… ఇకపై మరో లెక్క. ఏపీ రాజకీయాల్లో ఇదే జరగబోతోందా..? వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు ప్లాన్‌ రెడీ అయ్యిందా..? ఏడాది పాలన సందర్భంగా తొలి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభలో… చంద్రబాబు, పవన్‌ ఇవే సంకేతాలు ఇచ్చారా…? భవిష్యత్‌లో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి…? వైసీపీ భవిష్యత్‌ ఏంటి…?

వైసీపీకి ఇకపై దబిడి దిబిడే అన్న సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. తొలి అడుగు సభలో… జగన్‌ పర్యటనలు, వైసీపీ తీరును తప్పుబట్టారు. పవన్‌ కళ్యాణ్‌ అయితే ఒక అడుగు ముందుకేసి.. వైసీపీకి కాదు కాదు జగన్‌కే గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. గొంతులు కోస్తామంటే భయపడిపోతామా అని ప్రశ్నించారు. అవన్నీ చూసే ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. పిచ్చి పిచ్చి బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు బెదిరేది, భయపడేది లేదన్నారు పవన్‌.

గొంతుకలు కోస్తామన్న హెచ్చరికలకు భయపడబోమన్నారు. ఇవన్నీ చూసే ఇక్కడికి వచ్చామన్నారు. పిచ్చి బెదిరింపులు చేయొద్దన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. సంస్కారం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నామన్నారు. శాంతి భద్రతలు, అవినీతి విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని అధికారుల్ని పవన్ కోరారు. పోలీసులకు జగన్‌ ఇచ్చిన వార్నింగ్‌ను కూడా తప్పుబట్టారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు అధికారులను వదిలేది లేదని… తాము అధికారంలోకి వచ్చాక వారి పనిపడతామన్నారు. రిటైర్‌ అయ్యి విదేశాల్లో ఉన్నా.. వెంటాడుతామన్నారు జగన్‌. ఆ వ్యాఖ్యలపై పవన్‌ మండిపడ్డారు. అసాంఘిక చర్యల్ని సహించబోమన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ముందకెళ్లాలని అధికారులకు చెప్పారు పవన్‌.

సీఎం చంద్రబాబు కూడా.. జగన్‌ తీరును తీర్పారబట్టాను. జగన్‌ ఇటీవల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏ పర్యటనకు వెళ్లి.. ఏదో ఒక సంఘటన జరుగుతోంది. పైగా… బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ను జగన్‌ పరామర్శిస్తున్నారని… పోలీసు ఆంక్షలు కూడా పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో.. చంద్రబాబు తొలి అడుగు సభా వేదిక పైనుంచి జగన్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వదిలిపెట్టబోమని.. వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అన్నట్టు గానే.. వైఎస్‌ జగన్‌పై వరుస కేసులు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా.. జగన్‌ కారు కింద పడి వ్యక్తి మృతిచెందారు. ఈ కేసులో వైఎస్‌ జగన్‌ను ఏ2గా చేర్చారు పోలీసులు. అంతేకాదు.. గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కూడా కేసు నమోదైంది. దీంతో.. చంద్రబాబు, పవన్‌.. యాక్షన్‌లోకి దిగారని.. వైసీపీకి దబిడి దిబిడే అని కూటమి వర్గాలు చెప్తున్నాయి.

వైఎస్‌ జగన్‌ ఉంగరం వెనుక అసలు కథ ఇదేనా..?

Back to top button