ఆంధ్ర ప్రదేశ్

జైల్లో దయనీయంగా మిథున్‌రెడ్డి – తట్టుకోలేక కన్నీరుపెట్టుకున్న తల్లి స్వర్ణలత

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఆయనో ఎంపీ. పదవి, పవర్‌ అన్నీ ఉన్నాయి. చిటికేస్తే వస్తే సేవకులు, అభిమానులు, కార్యకర్తలు ఓవైపు… సకల సౌకర్యాల జీవితం మరోవైపు. ఇలా దర్జాగా గడిపారు. కానీ.. ఇప్పుడు… లిక్కర్‌ కేసులో అరెస్టై కటకటాల వెనక మగ్గుతున్నారు. ఊచలు లెక్కబెడుతున్నారు. సరైన భోజనం లేక… పడుకునేందుకు సరైన సదుపాయం లేక.. ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. జైల్లో ఆయన పరిస్థితి చూసిన కన్నతల్లి…. నా బిడ్డు ఈ పరిస్థితి ఏంటి…? అంటూ కంటతడి పెట్టుకుంది. ఇంతకీ ఎవరా ఎంపీ..? గెస్‌ చేశారుగా.

ఎంపీ మిథున్‌రెడ్డి. లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ములాఖాత్‌లో భాగంగా ఆయన్ను… తల్లి స్వర్ణలత, చెల్లెలు శక్తిరెడ్డి, బావ అఖిల్‌ కలిశారు. జైల్లో మిథున్‌రెడ్డి పరిస్థితి చూసి చాలా బాధపడినట్టు ఉన్నారు. మిథున్‌రెడ్డి తల్లి స్వర్ణలత.. ఆయన్ను కలిసి బయటకు రాగానే.. కన్నీరు పెట్టుకుంది. తన బిడ్డను టెర్రరిస్టులా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జైల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలేదని తెలిపింది. కొంచెం మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు. తన బిడ్డను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు.

పెద్దిరెడ్డి కుటుంబంపై… కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఆయనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని.. ఏసీ కూడా పెట్టించామన్నారు. కానీ… చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సౌకర్యాలు కూడా ఇవ్వకుండా చేస్తోందని మండిపడుతున్నారు. న్యాయస్థానం సౌకర్యాలు కల్పించమని చెప్పినా… రివ్యూ పిటిషన్లు వేసి.. అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Back to top button