
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- సాధారణంగా హిందూ పండుగలకు ముస్లింలు మరియు క్రిస్టియన్లు.. అలాగే ముస్లిం పండుగలకు హిందువులు అలాగే ఇతర మతాల వారు చాలా దూరంగా ఉంటారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. అలా ఎందుకు అంటున్నామంటే… తాజాగా హిందువుల అతి పెద్ద పండుగ అయినటువంటి వినాయక చవితి నిమజ్జనం రోజున తెలంగాణ రాష్ట్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. దాదాపు పది రోజులపాటు వినాయకుని విగ్రహం వద్ద పూజలు అందుకున్న లడ్డు నిన్న జరిగినటువంటి వేలంపాటలో ఒక ముస్లిం మహిళ దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈద్గం ఆదర్శనగర్ లో ఏర్పాటు చేసినటువంటి గణపతి విగ్రహం లడ్డువేలం పాటలో అమ్రిన్ అనే ముస్లిం మహిళ ఏకంగా 1,88,888 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు.
Read also : మోడీ ఎప్పుడూ స్నేహితుడే, మాట మార్చిన ట్రంప్!
ఒక ముస్లిం మహిళా అయ్యుండి హిందూ పండుగలో భాగం అవ్వడమే కాకుండా ఏకంగా 2 లక్షల రూపాయల వరకు లడ్డువేలం పాట పాడడమే కాకుండా చివరికి పట్టుబడి దక్కించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముస్లిం మహిళ అమ్రిన్ ను హిందూ పండుగలో భాగమైనందుకుగాను స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఆర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ వేలంపాటలో లడ్డును దక్కించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని ముస్లిం మహిళా అయినటువంటి అమ్రిన్ చెప్పుకొచ్చారు. మరోవైపు నారాయణపేట జిల్లా ముష్టిపల్లి లో ఏండి షా షా అనే ముస్లిం వ్యక్తి 26, 116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. దీంతో ఎటువంటి కుల, మత భేదాలు లేకుండా ఘనంగా వినాయక చవితి దేశవ్యాప్తంగా జరుపుకున్నారు.
Read also : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ప్రధాని మోడీ అమెరికా పర్యటన రద్దు!