సినిమా

సంక్రాంతికి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి : చిరంజీవి

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభాస్( రాజా సాబ్), చిరంజీవి, వెంకటేష్ ( మన శంకర్ వరప్రసాద్ గారు), రవితేజ ( భర్త మహాశయులకు విజ్ఞప్తి) ఇలా స్టార్ హీరోల సినిమాలు పండుగ సందర్భంగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిన్న చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగానే చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పండుగ వాతావరణం లో నాతోపాటు రిలీజ్ అవ్వబోతున్నటువంటి ప్రతి సినిమా కూడా ఘన విజయం సాధించాలి అని.. చిరంజీవి ఆకాంక్షించారు. అన్ని సినిమాల ప్రొడ్యూసర్లు అలాగే బయర్లు సంతోషంగా ఉన్నప్పుడే అది నిజమైన సంక్రాంతి అవుతుంది అని.. అదంతా ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది అని చిరంజీవి స్పష్టం చేశారు.

Read also : స్కూల్ గేమ్స్ అండర్–14 రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌కు మందమర్రి విద్యార్థుల ఎంపిక

కాబట్టి ఈ సంక్రాంతికి ప్రేక్షకులు అందరూ కూడా అన్ని సినిమాలను బిగ్ సక్సెస్ చేస్తారు అని ఆశిస్తున్నాను అని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా చిరంజీవి వ్యాఖ్యానించారు. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు అనే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరం కూడా చాలా కష్టపడ్డాము అని.. నేను అలాగే విక్టరీ వెంకటేష్ చాలా అల్లరి చేస్తూనే షూటింగ్ ను పూర్తి చేసాము అని అన్నారు. భవిష్యత్తులో విక్టరీ వెంకటేష్ తో ఫుల్ లెన్త్ సినిమా చేస్తానని చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి టీజర్లు మరియు ట్రైలర్లు అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. కాకపోతే ఇక్కడ ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుందా?… అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also : సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రయాణికులకు శుభవార్త…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button