ఆంధ్ర ప్రదేశ్తెలంగాణరాజకీయం

ఆలోచన కేసీఆర్‌ది – ఆచరణ జగన్‌ది – వాట్‌ ఏ స్ట్రాటజీ బాస్‌..!

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:-వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌.. ప్రస్తుతం ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులు. అధికారంలో ఉన్నప్పుడు ఐక్యంగా ఉన్నారు. విందుల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే… ఇంటికి వచ్చి మరీ పలకరించారు జగన్‌. అంతేకాదు… ముఖ్యమైన విషయాల్లో .. కేసీఆర్‌ సలహా తీసుకునేవారన్న వార్తలు కూడా వచ్చాయి. అప్పుడేనా.. ఇప్పుడు కూడా కేసీఆర్‌ సలహాలనే పాటిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు చాలా మంది. ఎందుకంటే.. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తే… అచ్చం కేసీఆర్‌ స్ట్రాటజీగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఎలా చేశారో.. ఇప్పుడు జగన్‌ కూడా అలాగే చేశారని చర్చించుకుంటున్నారు.

జగన్‌ అరెస్ట్‌ కుదరదన్న చంద్రబాబు..? – ఎందుకో తెలుసా..!

వెన్నుపోటు దినం పేరుతో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు… భారీగానే తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే… వైఎస్‌ జగన్‌ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన.. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని… పార్టీ నేతలు, కార్యకర్తలతో.. ఈ కార్యక్రమం చేయించారని అనుకుంటున్నారు. జగన్‌ తీరును… తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తీరును పోలుస్తున్నారు విశ్లేషకులు. అప్పుడు కేసీఆర్‌ కూడా ఇలానే చేశారని.. ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండి… పార్టీ నేతలు, రాష్ట్ర ప్రజలను ఉద్యమంలోకి ఉసిగొల్పారని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా సేమ్‌ టు సేమ్‌ అలాగే చేశారన్న వాదన వినిపిస్తోంది. నేతలు, కార్యకర్తలు వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొంటే… సాయంత్రం తీరిగ్గా ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టి… తమ నిరసన కార్యక్రమం విజయవంతం అయ్యిందంటూ ట్వీట్‌ చేసి… వైఎస్‌ జగన్‌ చేతులుదులుపుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్‌ గతంలో ఇలా లేరు. పార్టీకి సంబంధించి చేపట్టిన ఏ కార్యక్రమమైనా.. ఆయనే ముందుండే వారు. ఓదార్పు యాత్ర, ప్రజాసంకల్ప పాదయాత్ర.. రైతు దీక్ష, నిరుదోగ్య దీక్ష ఇలా… ఏ కార్యక్రమం చేపట్టినా… తానే హైలెట్‌ అయ్యేవారు. అధికార పార్టీని కడిగిపారేసేవారు. కానీ… ఇప్పుడు అలా ఎందుకు చేయలేదు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో జగన్‌ ఎందుకు పాల్గొనలేదు..? నేతలు, కార్యకర్తలను మాత్రమే.. ఎందుకు పంపారు..? అంటే… వైఎస్‌ జగన్‌.. కేసీఆర్‌ తరహా పాలిటిక్స్‌ చేయాలని భావిస్తున్నారు. తాను వెనకుండి.. క్యాడర్‌తో పోరాటాలు, ఉద్యమాలు చేయించాలని భావిస్తున్నారా..? అన్న చర్చ జరుగుతోంది.

గెలిచిన ఆనందం.. ప్రజల్లో మాయం… నిరాశగా ఫ్యాన్స్… లండన్ కు విరుష్క.. అసలు జాలే లేదంటున్న ప్రేక్షకులు!

ఇక మన దగ్గరే రాఫెల్ తయారీ, ఎరోస్పేస్ హబ్ గా హైదరాబాద్!

Back to top button