తెలంగాణ

లోకేష్‌ను కలవలేదు, ఒకవేళ కలిస్తే తప్పేంటి?: కేటీఆర్‌

  • రేవంత్‌ను మానసిక ఆస్పత్రిలో చూపించాలి

  • అసత్య ఆరోపణలు చేయడం రేవంత్‌ మానుకోవాలి

  • సీఎం ఆరోపణలు మాని, హామీలపై దృష్టిపెట్టాలి

  • మైక్‌ కట్‌ చేయకుంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధం: కేటీఆర్‌

క్రైమ్‌ మిర్రర్‌, ఖమ్మం: సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేయడం మానుకొని, హామీల అమలుపై దృష్టిపెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చురకలంటించారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ రేవంత్‌కి కేసీఆర్‌ స్థాయి ఎప్పటికీ రాదని అన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. తప్పు చేయలేదు కాబట్టే తాము గట్టిగా మాట్లాడుతున్నామని అన్నారు కేటీఆర్‌. అభివృద్ధిపై చర్చకు సవాల్‌ విసిరిన రేవంత్‌రెడ్డి… చివరకు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. తమ మైక్‌ కట్‌ చేయకుండా ఉంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని కేటీఆర్‌ తెలిపారు.

మానసిక చికిత్స అవసరం

సీఎం రేవంత్‌రెడ్డిని మానసిక ఆస్పత్రిలో చూపించాలని కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ సూచించారు. ఆధారాలు లేకుండా డ్రగ్స్‌, హీరోయిన్స్‌ అంటూ రేవంత్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకు ఏంటి సంబంధమని కేటీఆర్‌ ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు.

లోకేష్‌ను కలవలేదు… కలిస్తే తప్పేంటి?

టీడీపీ అగ్రనేత, ఏపీ మినిస్టర్‌ లోకేష్‌ను అర్థరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు కేటీఆర్‌. లోకేష్‌ను కలవలేదని, ఒకవేళ కలిసినా తప్పేంటని ఎదురు ప్రశ్నించారు కేటీఆర్‌. బనకచర్లపై సీఎం రేవంత్‌ తప్పుడు సంకేతాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సమావేశంలో బనకచర్లపై చర్చించామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబితే… అసలు చర్చించనేలేదని రేవంత్‌ ఎలా అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి రహస్య ఒప్పందం బయటపడటంతోనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపామన్నారు కేటీఆర్‌. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు.

Read Also: 

  1. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ఫోకస్‌ షిప్ట్‌
  2. తీరిన రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ… హంద్రీనీవా ఫేజ్‌-1 పంపింగ్‌ షురూ
Back to top button