
Rains In Telangana: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చి, వాయువ్య దిశగా కదిలి భవానీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దక్షిణ ఒడిశా, దక్షిణ చత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఈ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
బుధవారం ఏ జిల్లాల్లో వానలు కురుస్తాయంటే?
బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అటు గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.