
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న చంద్రబాబు బర్త్డే సందర్భంగా కేటీఆర్ చంద్రబాబు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర చాలా ఉందని చంద్రబాబును మెచ్చుకున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కార్యకర్తల చర్చల సమావేశంలో కేటీఆర్ చంద్రబాబునాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రాంతానికి ఐటీ కంపెనీలు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చాలా ఉందని వివరించారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు భవిష్యత్తులో మరింత మంది రావాలని తెలిపారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శలు చేశారు కేటీఆర్. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చిందని, తద్వారా ప్రజలను కూడా మోసం చేయడంలో వెనుకాడ లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చాలా మంచి పనులు చేశారని … కానీ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా కెసిఆర్ ఆనవాళ్లు కనిపించకుండా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గ్యారెంటీ కూడా అమలు చేయకుండానే ప్రజలను మోసం చేస్తూ ముందుకు వెళుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.