
పాతబస్తీ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్.. కార్యకలాపాలు నిలిపివేత
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: పాతబస్తీ ప్రాంతంలోని సిటీ సివిల్ కోర్టు అసహజ ఘటనకు వేదికైంది. గుర్తు తెలియని దుండగులు కోర్టుకు బాంబు పెట్టినట్లు ఫోన్‌లో బెదిరింపు కాల్ చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో ఒక్కసారిగా హడావుడి నెలకొంది. సురక్షిత చర్యలలో భాగంగా కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును పూర్తిగా మూసివేసి, కోర్టు ప్రాంగణంలో ఉన్న లాయర్లు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించారు.
తరువాత డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తో పోలీసులు ప్రతి చొరపట్టున సోదాలు నిర్వహించారు.
అయితే కొంతసేపటికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో భద్రతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.