జాతీయం

మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత.. ఏమైందంటే?

Shibu Soren Passes Away: జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తుదిశ్వాస విడిచారు. ఇవాళ (సోమవారం) ఉదయం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు సోరెన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన..  పరిస్థితి విషమించడంతో చనిపోయారు. కొంతకాలంగా శిబు సోరెన్ కిడ్నీసంబంధ సమస్యతో పాటు.. పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

తండ్రి మరణంపై హేమంత్ సోరెన్ ప్రకటన

శిబు సోరెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ కీలక ప్రకటన చేశారు. గురూజీ మనందరినీ విడిచిపెట్టారంటూ బాధాతప్త హృదయంతో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు   “గౌరవనీయులైన దిశోం గురూజీ మనందరినీ విడిచిపెట్టారు. ఈ రోజు నేను అన్నీ కోల్పోయి భావన కలుగుతోంది.  శూన్యంలో ఉన్నట్లు అనిపిస్తోంది” అని  ఎక్స్ లో పోస్టు పెట్టారు.

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం

శిబు సోరెన్ జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో పోరాటం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం మొదటి నుంచి ఆయన మద్దతు ప్రకటించారు.

Read Also: రాహుల్ లాగే.. చిదంబరం.. ఎన్నికల సంఘం ఆగ్రహం!

Back to top button