
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అయ్యప్ప మాలధారణ భక్తులతో శుక్రవారం సందడిగా మారింది. అయ్యప్ప పంబారట్టు (జలక్రీడ) సమీపంలోని గోదావరిలో కన్నులపండువగా జరిగింది. జల క్రీడలో భాగంగా అయ్యప్ప స్వామికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బస్వం, పంచదార, గంధం, పసుపుతో అభిషేకం చేశారు. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో శుక్రవారం అయ్యప్ప పంబారట్టు ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలై సన్నిధానం సమీపంలోని పంబానదిలో ఏ విధంగా జరుగుతుందో అదే రీతిలో ఉత్సవాలు జరిపారు.
Read also : దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇబ్బందిగా మారిన పొగ మంచు..?
Read also : సంక్రాంతికి బరిలో తోపు మూవీస్.. మరి టికెట్ రేట్ల సంగతేంటి?





