క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో దూరపు సమయాలకు ప్రయాణ సౌకర్యం ఏంటి అంటే అది కచ్చితంగా రైళ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా దూరపు ప్రయాణాలను చాలా తక్కువ ధరకు అలాగే అతి త్వరగా వెళ్ళవచ్చు. ప్రస్తుతం మన భారతదేశంలో ప్రతిరోజు కూడా కొన్ని లక్షల సంఖ్యలో జనం ట్రైన్లలో ప్రయాణాలు చేస్తున్నారు. అయితే తాజాగా రైల్వే అధికారులు అదనపు లగేజ్ పై చార్జీలు విధించడానికి సిద్ధమయ్యారు. స్లీపర్, ఏసీ త్రీ టైర్ లో ప్రయాణికులు 40 కేజీలు, సెకండ్ ఏసీ ప్యాసింజర్లు 50 కేజీలు, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కేజీల వరకు లగేజీ తీసుకు వెళ్ళేందుకు అనుమతులు ఇచ్చారు. ఇక సాధారణ జనరల్ బోగీలో ప్రయాణించే ప్రజలు 35 కేజీల కంటే ఎక్కువ లగేజీ తీసుకు వెళ్లలేరు. ఒకవేళ అదనపు లగేజీ తీసుకువెళ్లాలి అంటే కచ్చితంగా ఇకనుంచి అదనపు చార్జీలు వసూలు చేయాలి అని రైల్వే నిర్ణయించింది. కాబట్టి ఒకటికి రెండుసార్లు ఈ విషయాన్ని గుర్తుకు చేసుకొని మీతో పాటు అధికారులు నిర్ణయించిన కేజీల ప్రకారం లగేజ్ ని తీసుకువెళ్లాలని సూచించారు. కానీ మరోవైపు చాలామంది నెటిజన్లు ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల సామాన్య ప్రజలకు మరింత భారం కలుగుతుంది అని అంటున్నారు.
Read also : నిన్న శ్రీ లీల నేడు నివేదా థామస్.. హీరోయిన్లను బాధపెడుతున్న మార్ఫుడ్ ఫోటోలు
Read also : Social Media: సోషల్ మీడియాలో పరిచయమైన అబ్బాయి కోసం ఇల్లు వదిలేసిన అమ్మాయి





