
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజిని పోలీసు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. కావాలనే తనతో పాటుగా తన అనుచరులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మా అనుచరులపై పెట్టినటువంటి తప్పుడు కేసులను తొలగించాలి అని లేదంటే వారిని వదిలే ప్రసక్తి లేదని తాజాగా పల్నాడు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అంతటితో ఆగకుండా.. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు… ప్రతీకారం కోసం ఫిర్యాదులు చేస్తుంటే వెంటనే అధికారులు కూడా వారిపై కేసులను నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని విడుదల రజిని వెల్లడించారు. ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులు అందరూ కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఎన్ని తప్పుడు కేసులైన పెట్టుకోండి.. రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారిని వదిలే ప్రసక్తే లేదు అని విడుదల రజిని పోలీసు అధికారులను హెచ్చరించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో మళ్లీ నేను గెలిచిన చిలకలూరిపేట నుంచే తిరిగి మళ్లీ పోటీ చేస్తాను అని మీడియా వేదికగా విడుదల రజిని తెలిపారు.
Read also : ఐపీఎల్ నుంచి బిగ్ అప్డేట్.. వచ్చే నెలలోనే మినీ వేలం!
Read also : శ్రీ చరణి మంచి మనసు.. కడప క్రికెట్ అకాడమీ ప్రశంసలు!





