అంతర్జాతీయం

భారత్- అమెరికా వాణిజ్య చర్చలు.. వాషింగ్టన్ కు ఇండియా టీమ్!

India-US trade deal: భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ చర్చలు కొనసాగనున్నాయి. వాషింగ్టన్‌ లో ఈ చర్చలు జరగుతున్నాయి. భారత వాణిజ్య శాఖ అధికారులతో కూడిన ఓ బృందం ఈ చర్చల్లో పాల్గొంటుంది. ఈ బృందంలో చీఫ్‌ నెగోషియేటర్‌ గా  వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ వ్యవహరించనున్నారు.

నాలుగు రోజుల పాటు వాణిజ్య చర్చలు

సోమవారం మొదలైన ఈ చర్చలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. గురువారం నాడు ఈ వాణిజ్య చర్చలు ముగిసే అవకాశం ఉంది. వ్యవసాయం, ఆటోమొబైల్‌ లాంటి రంగాల్లో ఇబ్బందులను తొలగించుకునేందుకు ఈ చర్చలు ఉపయోగపడనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కూడా అదనపు టారిఫ్‌ల అమలును వాయిదా వేసింది. ఆగస్టు 1 వరకు పలు దేశాలకు గడువు పొడిగించింది.

ఆగష్టు 1 నాటికి తొలి డీల్

అమెరికాతో జరిగే చర్చల్లో భారత్ పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నది. ఆగష్టు 1 నాటికి తొలి విడత డీల్ ను ఓకే చేసుకోవాలని భావిస్తోంది. ఆ తర్వాత చర్చలు కొనసాగించి పూర్తి స్థాయి ఒప్పందానికి రావాలని ప్రయత్నిస్తోంది. భారత్ ముఖ్యంగా వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకు టారీఫ్‌ లలో రాయితీలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించలం లేదు. మరోవైపు 26 శాతం టారిఫ్‌ లను అమెరికా తొలగించాలని డిమాండ్ చేస్తోంది. స్టీల్‌ పై 50 శాతం, ఆటో రంగంపై 25 శాతం పన్ను తొలగించాలంటుంది. ఈ నేపథ్యంలో ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది త్వరలో తేలనుంది.

Read Also: మధ్యాహ్నం 3 గంటలకు.. ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగనున్న శుభాన్షు!

Back to top button