
టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా యశస్విజేష్వాల్ ను నియమించాలని ఇండియా కోచ్ గంభీర్ బిసిసిఐ తో చర్చించాడట. రోహిత్ శర్మ తర్వాత టెస్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై బీసీసీఐ తీవ్రంగా శ్రమిస్తుంది. నిన్న మరియు ఈరోజు అగర్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ అలాగే గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారట. ఇందులో మొదటగా బుమ్రా కు కెప్టెన్సి ఇస్తే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని అందరూ కూడా భావించారట.
యాదాద్రి ధర్మల్ ప్లాంట్ లో లైసెన్స్ దొంగలు..!?
తర్వాత ఈ క్రమంలోనే టెస్ట్ కెప్టెన్ గా రిషబ్ పంతును నియమించాలని అనుకోగా వెంటనే కోచ్ గంభీర్ కలుగ చేసుకుని యశస్వి జై శ్వాల్ ను టెస్ట్ కెప్టెన్గా చేస్తే ఎలా ఉంటుందని చర్చించారట. అయితే కోచ్ గంభీర్ అనూహ్యంగా జైష్వాల్ పేరును ప్రతిపాదించడంతో అందరూ కూడా షాక్ అయ్యారట. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందో వేచి ఉండాల్సిందే.
కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం.. డీకే కోసం రేవంత్ డీల్స్!
కాగా ఈ మధ్య రోహిత్ శర్మ వరుసగా టెస్టులలో అటు బ్యాటింగ్ పరంగాను ఇటు కెప్టెన్ పరంగాను సరిగా రాణించకపోవడంతో బిసిసిఐ రోహిత్ శర్మను తొలగించి ఆ స్థానంలో వేరే ఎవరినైనా కెప్టెన్ గా చేస్తే బాగుంటుంది అనే నిర్ణయం త్వరలోనే తీసుకుబోతుంది. తాజాగా ఈ నేపథ్యంలోనే చాలామంది క్రికెట్ ప్లేయర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు ఎక్కువగా అనుభవం లేని యశస్వి జైస్వాల్ పేరును కోచ్ గంభీర్ తెరపైకి తీసుకురావడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.