
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఫోర్జరీ సంతకాలతో నకిలీ మంజూరు పత్రాలు సృష్టించి, పలువురి దగ్గరి నుండి 20 లక్షల రూపాయలను వసూలు చేసి పారిపోయిన వ్యక్తి.. హైదరాబాద్ – బంజారాహిల్స్ ప్రసాద్ లాబ్స్ లో ఆఫీసు బాయ్ గా పని చేస్తున్న నాగరాజు రెడ్డి అనే వ్యక్తికి, అక్కడే ప్లంబింగ్ పని చేసుకునే కొందరు పరిచయమయ్యారు.. తనకు రాజకీయ పరిచయాలు ఉన్నాయని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానని వారి దగ్గర 20 లక్షల రూపాయలు వసూలు చేశాడు.. ఫోర్జరీ సంతకాలతో నాగరాజు రెడ్డి నకిలీ మంజూరు పత్రాలు సృష్టించి వారికి అందచేశాడు. నాగరాజు రెడ్డి ఇచ్చిన పత్రాలతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లగా అవి నకిలీ మంజూరు పత్రాలని తెలిసింది.. దీనితో నాగరాజు రెడ్డిని వారు నిలదీయగా మరోచోట ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి, రాత్రికిరాత్రే ఆంధ్రప్రదేశ్ లోని తన సొంత గ్రామానికి పారిపోయాడు. నాగరాజు రెడ్డిని వెతికి పట్టుకొని తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు వేడుకుంటూ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితులు పిర్యాదు చేశారు.. వారు ఇచ్చిన పిర్యాదుపై విచారణ మొదలు పెట్టిన పోలీసులు, నాగరాజు కోసం గాలిస్తున్నట్లు సమాచారం.