
Fadnavis-Uddhav Thackeray Meet: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. బీజేపీని విభేదించి కాంగ్రెస్ తో చేతులు కలిపిన ఉద్ధవ్ థాక్రే మళ్లీ కాషాయం పార్టీతో జతకలవబోతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో జరుగుతున్న తాజా పరిణాలు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. తాజాగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశం అయ్యారు. విధాన మండలి చైర్మన్ రామ్ శిండే కార్యాలయంలో వీరిద్దరూ సుమారు 20 నిషాల పాటు చర్చించారు. ఈ సమావేశం మహా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు రానం అయ్యింది. అధికార పక్షం వైపు రావాలంటూ ఉద్ధవ్ కు ఫడ్నవీస్ ఆఫర్ ఇచ్చిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ఉద్ధవ్ ను అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించారు. ‘‘2029 వరకు మేం ప్రతిపక్షంలోకి వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ ఉద్ధవ్ జీ అధికార పక్షం వైపు రావాలనుకుంటే రావచ్చు. ఈ అవకాశాన్ని వారు పరిశీలించాలి’’ అన్నారు.
శివసేన, బీజేపీ మధ్య గొడవలు ఎలా?
నిజానికి మహారాష్ట్రాలో బీజేపీ, శివసేన స్నేహం 2014 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాయి. దాదాపు 25 ఏండ్ల పాటు రెండు పార్టీలు కలిసి పని చేశాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీని కాదని, ఉద్ధవ్.. కాంగ్రెస్ తో జతకట్టారు. సీఎం పదవి చేపట్టారు. రెండున్నర ఏళ్ల తర్వాత ఫడ్నవీస్ తన మార్క్ రాజకీయం చూపించాడు. 2022లో ఏక్ నాథ్ శిండేతో తిరుగుబాటు చేయించాడు. శివసేనను చీల్చి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (శిండే) కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ సీఎం అయ్యారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ఉద్దవ్ ను మళ్లీ బీజేపీతో జతకట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆదిశగా అడుగులు పడుతున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.
Read Also: కాశ్మీర్ లో కుండపోత వర్షాలు, అమర్ నాథ్ యాత్ర రద్దు!