అంతర్జాతీయం

జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం, ప్రధాని ఇషిబా రాజీనామా!

Japan PM Resign: జపాన్ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది.   జూలైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి పార్లమెంట్‌ ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తన పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహించాలని డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

వరుస పరాజయాలతో అతర్గత ఒత్తిడి!

గతేడాది ఫుమియో కిషిద రాజీనామా తర్వాత అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ  అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఇషిబా.. అక్టోబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జులైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌ ఎగువ సభలో ఇషిబా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మెజార్టీ సాధించలేకపోయింది. గత అక్టోబరులో జరిగిన దిగువసభ ఎన్నికల్లోనూ ఈ కూటమి ఓటమి పాలైంది. 1955లో స్థాపించిన ఎల్‌డీపీ రెండు సభల్లోనూ మెజార్టీ కోల్పోవడం ఇదే తొలిసారి.  ఎన్నికల్లో పార్టీ వరుస పరాజయాలతో ఆయన నాయకత్వంపై అసంతృప్తి పెరిగింది. రాజీనామా డిమాండ్లు పెరగడం, అవిశ్వాస తీర్మానం తేవాలన్న ప్రతిపాదన కూడా రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.షిగేరు ఇషిబా తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

Back to top button