తెలంగాణ

HCU భూములపై గళమెత్తిన సెలబ్రిటీలు - రేవంత్‌ సర్కార్‌కు అనుకూలమా..? వ్యతిరేకమా..?

HCU భూముల వివాదం… ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. కేబినెట్‌ మొత్తం క్లారిటీ ఇచ్చినా.. ఇంకా చాలా మందిలో ఏవో అనుమానాలు. ఒక్కొక్కరిది ఒక్కో వాదన. ఆ భూమిని అమ్మి అభివృద్ధి చేస్తే తప్పేందని కొందరు అంటుంటే… పర్యావరణ హితంకాదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ వివాదం సోషల్‌ మీడియానూ కుదిపేస్తుంది. HCU వర్సెస్‌ రేవంత్‌ సర్కార్‌ పేరుతో పోలింగ్‌లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు… సెలబ్రిటీలు కూడా గళమెత్తారు. తమ వాదన వినిపిస్తున్నారు. మరి.. సినీ ఇండస్ట్రీ ప్రముఖుల వర్షన్‌ ఏంటి…? రేవంత్‌రెడ్డి సర్కార్‌ పనిని సమర్థిస్తున్నారా…? లేక.. HCUకి మద్దతు ఇస్తున్నారా…?


Also Read : భూములు అమ్మితే ఒప్పుకోం.. రేవంత్ కు సీపీఐ ఝలక్


కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంపై… సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌… ఇది మన ఖర్మ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. దీనిపై మీడియా ప్రశ్నించగా… గచ్చిబౌలి ప్రాంతంలో ఆ 400 ఎకరాల భూమి గ్రీన్‌ ఏరియా అని చెప్పారాయన. 400 ఎకరాల్లో ఉన్న చెట్లను కొట్టేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి… సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. హీరో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన, ఏపీ డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణూదేశాయ్‌, ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌, సమంత, ఈషా రెబ్బ.. లేటెస్ట్‌గా హీరోయిన్‌ రష్మిక కూడా HCU భూములపై పోస్టులు పెట్టారు. 400 ఎకరాల్లో పచ్చదనాన్ని కాపాడాలన్నదే వీరందరి వర్షన్‌. అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయొద్దని.. వన్య ప్రాణుల్ని కాడాలన్నదే వీరి వాదన.


Also Read : రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి జానారెడ్డి చెక్! తెరవెనుక సీఎం రేవంత్ రెడ్డి?


HCU భూముల వివాదంపై టాలీవుడ్‌ ప్రముఖ ట్వీట్లకు… కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ట్విట్టర్‌ అకౌంట్‌లో కౌంటర్‌ ఇస్తున్నారు. ఆనాడు సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలోనే అన్యాయం చేసినవారి వైపే సెలబ్రిటీలు నిలబడ్డారని.. ఇప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకునే వారివైపే ఉంటున్నారని… సెటైరికల్‌ పోస్టులు పెట్టారు. విషయం తెలుసుకోకుండా… మిడిమిడి జ్ఞానంతో ఉండటం కరెక్టేనా సెలబ్రిటీల్లారా..? అంటూ విమర్శించారు. దీంతో… నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ రియాక్ట్‌ అయ్యాడు. కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పనిచేసే వారిని కాకుండా… పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా… మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్లనే ప్రోత్సహిస్తున్నారు కదా… దీనికి ఏం సమాధానం చెప్పాలి సార్‌.. అంటూ కాంగ్రెస్‌కు కౌంటర్‌ వేశారు. దీంతో… బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా.. HCU భూముల వివాదం… తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదం… ఎటు వైపు దారి తీస్తోంది…? దీనికి ఎక్కడ ఫుల్‌స్టాప్‌ పడుతుందో..? చూడాలి.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button