తెలంగాణ

వర్కాల సూర్యనారాయణకు ఉగాది పురస్కార అవార్డు

ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:- సీవీ రామన్ అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాల్లో భాగంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న పలువురికి ఉగాది పురస్కార అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా శ్రీశైలంలోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలీయుల నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు, సంఘ సేవకులు వర్కాల సూర్యనారాయణకు ఉగాది అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ లో వర్కాల సూర్యనారాయణ మాట్లాడారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి సీవీ రామన్ అకాడమీ వారు ఉగాది పురస్కార అవార్డును అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, మరింతగా ప్రజలకు సేవ చేస్తానని హామి ఇచ్చారు.

జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!

కేటీఆర్ పాదయాత్ర… ఆంధ్రావాలా బాటలో నడుస్తున్నాడా?

Back to top button