క్రైమ్ మిర్రర్, ములుగు (ప్రతినిధి) : మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు జాతర సౌకర్యాలు, చరిత్ర గురించి ఆన్లైన్లో సెల్‌ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం ‘మై మేడారం యాప్’ను అందుబాటులోకి తెచ్చింది. ఇది భక్తులకు ఓ గైడ్‌గా పనిచేయనుంది. నాటి ఎడ్లబండి నుంచి గాలిమోటర్ వరకు వచ్చిన సౌకర్యాలతోపాటు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతర విశేషాలు, ముఖ్యమైన ఘట్టాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మేరకు శనివారం మంత్రి సీతక్కతోపాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ పీ శబరీష్ ‘మై మేడారం యాప్’ను ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా ‘మై మేడారం గైడ్ 2024’ అనే పేరుతో అందుబాటులో ఉంది. యాప్ ద్వారా జాతరలోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్రాం తాలు, మరుగుదొడ్లు, స్నానఘట్టాల వివరాలు, తప్పిపోయిన వారి కోసం మైక్‌ల ద్వారా పిలిచే కేంద్రాలు, ఫైర్ ఇంజన్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్లో మరో వికెట్ డౌన్.. ఈసారి ఎమ్మెల్యే.. ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచే లీకులు..!!!
- ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. రంగంలోకి తెలంగాణ సీఎం???
- పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించనున్న తెలంగాణ బీజేపీ.. నేటి నుండి విజయ సంకల్ప యాత్రలు
- రేవంత్ రెడ్డి దెబ్బకు నీరుగారిపోతున్న బీఆర్ఎస్… కేసీఆర్‌కు పెద్ద కష్టమే!!!
2 Comments