
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపటితో ముగుస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో స్థానిక ఎన్నికలపై మళ్ళీ రాష్ట్రమంతటా కూడా ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. అవి ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలలో ముందుకు వెళ్తామని చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయంపై తాజాగా TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపటితో ముగియనున్న సందర్భంగా ప్రస్తుతం ప్రభుత్వం లోకల్ ఎలక్షన్స్ పై ఫోకస్ చేస్తుంది అని తెలిపారు. ఈ స్థానిక ఎన్నికల నిర్వహణపై మరో 2 లేదా మూడు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూసి దాని ప్రకారం ముందుకు వెళ్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఒకవేళ కోర్టు రిజర్వేషన్లను అంగీకరించకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలలో ముందుకి వెళ్తామని చెప్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నియోజకవర్గం వ్యాప్తమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉత్కంఠత రేపింది. మరి స్థానిక ఎన్నికలు ఎలా జరగబోతాయనేది కూడా ఆసక్తికరంగానే మారింది.
Read also : Weather Alert: మరో రెండు రోజులు భారీ వర్షాలు
Read also : Kavitha’s Tweet: కలం యోధుడు కాళోజీ నారాయణరావు





