
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు టీమిండియా క్రికెట్ చరిత్రలో ఎంత ‘కీ’రోల్ పోషించారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత రోజుల్లో టీమిండియా ఇంతటి బలమైన జట్టుగా ఉండడానికి కారణం వీరిద్దరు కొన్నేళ్ల నుంచి ఆడుతున్న ప్రదర్శినే కారణం. వీరిద్దరి కెప్టెన్సీలో భారత్ అద్భుతమైన విజయాలను అందుకుంది. అయినప్పటికీ కూడా వీరిద్దరి భవిష్యత్తు గురించి తమ కేరీలో ఏం సాధించని వారు కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు. తమ క్రికెట్ చరిత్రలో పెద్దగా ఏం సాధించిన వారు కూడా రోహిత్ మరియు విరాట్ కోహ్లీల భవిష్యత్తును నిర్ణయించడం గురించి మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. మేము క్రికెట్ ఆడుతున్న సమయంలో కూడా మాపై అలాగే మా తోటి సహచర ప్లేయర్లకు ఇలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అని హర్భజన్ సింగ్ తెలిపారు. వయసు పెరిగిపోతున్నప్పటికీ రోహిత్ మరియు విరాట్ కోహ్లీలలో ఫిట్నెస్ తో పాటు ఆట ప్రదర్శన కూడా అద్భుతంగా పెరుగుతూ వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో వారిద్దరి భవిష్యత్తును కొంతమంది నిర్ణయిస్తుండగా హర్భజన్ సింగ్ మండిపడ్డారు. ఇకపోతే మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు నుంచే టీమిండియా కోచ్ గంభీర్ తో.. రోహిత్ మరియు విరాట్ కోహ్లీ లకు పడట్లేదు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్న సమయంలో హర్భజన్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరో చర్చకు దారితీస్తున్నాయి.
Read also : గడిచిన రెండేళ్లలో పథకాలకు ఖర్చుపెట్టిన డబ్బు ఎంతో తెలుసా?
Read also : ఈ యుద్ధాలు ఇంతటితో ఆగాలి.. 8 ఆపాను.. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది : ట్రంప్





