తెలంగాణ

ఇండ్లకు 24 గంటలు తాగునీటి సరఫరా.. దేశంలో తొలి నగరంగా రికార్డ్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజంతా మంచి నీళ్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్ సునీల్ రావు ఈ దిశగా తొలి అడుగు వేయబోతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీ పరధిలోని 2,660 ఇండ్లకు ఇకపై ప్రతిరోజు 24 గంటలపాటు తాగునీటిని సరఫరా చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటి వరకు దేశంలోని ఒకటి, రెండు పట్టణాల్లో మాత్రమే ఇటీవల 24 గంటలపాటు తాగునీటి సరఫరా ఇచ్చే కార్యక్రమాలు ప్రారంభయ్యాయి.
చండీగఢ్ఢ్ లోని మణిమజ్రా పట్టణంలో గత ఏడాది ఆగస్టులో  24/7 గంటలపాటు తాగునీటిని సరఫరా చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ పట్టణంలో కూడా 24 గంటలపాటు నిరంతరాయంగా మంచి నీటిని సరఫరా చేస్తున్న దాఖలాల్లేవు. కరీంనగర్ ఆ రికార్డును సాధించబోతోంది.ఈనెల 24న కరీంనగర్ కార్పొరేషన్ లో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు డివిజన్లో 4,055 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని అందించాలనే ఆశయం నెరవేరడానికి అంకురార్పణ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి  కేంద్ర పట్టణాభివ్రుద్ది, గ్రుహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా రానున్నారు.   2,200 ఇళ్లకు 24 గంటల పాటు తాగునీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఆ తరువాత కొద్దిరోజుల్లోనే హౌజింగ్ బోర్డులో పరిధిలోని 4,055 ఇండ్లకు నిరంతరాయంగా మంచి నీళ్లు సరఫరా కానున్నాయి.  కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో నగర మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టిన నిరంతరాయ మంచి నీటి సరఫరా పనులన్నీ పూర్తయ్యాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇళ్లకు 365 రోజులపాటు తాగునీటిని అందించిన కరీంనగర్ కార్పొరేషన్ కు దక్కబోతోంది.
Back to top button