
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా ఎన్నో చెరువులు, నదులు, జల ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం కారణంగా రాబోయే మరో మూడు,నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు కొంతమంది అధికారులు భేటీ అయ్యారు. ఇక ఈ వర్షాకాలం ముగింపునకు దగ్గరలోనే ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో నెల రోజులు మాత్రమే వర్షాలు కురుస్తాయని.. ఆ తరువాత వర్షాలు తగ్గుముఖం పడతాయని సీఎం కొంతమంది అధికారులకు సూచించారు. కాబట్టి ఈలోపే రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు, ప్రతి ఒక్క రిజర్వాయర్ ను కూడా నీటితో నింపాలని అధికారులను ఆదేశించారు. లేదంటే రాబోయే మూడు నాలుగు నెలల్లో ప్రజలు ఇబ్బంది పడతారు అని స్పష్టం. జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో తాజాగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా మంత్రి నిమ్మలు రామానాయుడు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ హాజరయ్యారు. ఈ వర్షాల ప్రభావంతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని, బాధితులకు నష్టపరిహారం ఏర్పాటు చేయాలని అన్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వచ్చే నెల చివర ఆఖరిలోపు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది.
Read also : తెలుగోడు విరుచుకుపడడానికి అతడే కారణం?
Read also : గెలిచి 10 గంటలు అవుతుంది… ఇప్పటివరకు నో విషెస్?