
నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆందోళనలతో దద్దరిల్లుతోందిమహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసిని తొలగించాలని 1000 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇటీవలే విద్యార్థినులకు గొడ్డు కారంతో అన్నం పెట్టారు. ఆ రోజు నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నాసిరకం భోజనం పెడుతున్నారని.. సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయినా వీసీ స్పందించకపోవడంతో ఇవాళ ఆందోళనకు దిగారు.
నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ సైన్స్ కామర్స్ బిటెక్ విద్యార్థులు కాలేజీకు బందుకు పిలుపునిచ్చి VC కార్యాలయం ఎదుట పెద్ద డప్పుల చప్పుడుతో పెద్ద ఎత్తున మూడు గంటల పాటు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ VC నియంతృత్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పారు. అనేకమార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో నేడు VC కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
వివిధ జిల్లాల నుంచి యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులని విద్యకు దూరం చేయడానికి సుమారు వందమంది విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నారని వాపోయారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్
జనవరి 9న నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెట్టింది మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం. అనేకమార్లు యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించకపోవడంతో యాజమాన్యంతో గొడవకి దిగిన విద్యార్థినులు